శాసనమండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. కేటీఆర్ రైతు దీక్స పై కౌంటర్ ఎటాక్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతు దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. కరెంట్ కట్ అయినా.. ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయిన రైతులే రోడ్డు ఎక్కుతున్నారు. రాజకీయ పార్టీలు చెబితే రైతులు ధర్నాలు చేయరని దుయ్యబట్టారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం 100 శాతం కులగణన సర్వే ఫర్ఫెక్ట్ చేసిందని తెలిపారు.
అసలు కులగణన మీద బీసీల జనాభా పై లెక్క ఎక్కడ ఉంది.. దేశంలోనే ఇదే మొదటిసారి కదా బీసీ కులగణన చేసిందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆఫిషియల్ రికార్డు లేదు.. బీసీ కులగణన సర్వే సరైనదని తెలిపారు. నాయకుడికి కులం, మతంతో సంబంధం ఉండదు.. ప్రజలతో మమేకమైన వాడే నాయకుడు అవుతాడని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మరోవైపు బీజేపీ బీసీ కులగణనకు వ్యతిరేకమని అందరికీ తెలిసిందే. వ్యవస్థలపై గౌరవం తగ్గుతున్న మాట వాస్తవమే అని తెలిపారు.