తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా 2023 డిసెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో హామీల మేరకు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. అందులో ముఖ్యంగా కళ్యాణలక్ష్మీలో భాగంగా తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మంత్రి జూపల్లి ఆ విషయాల గురించి మాట్లాడుతూ తడబడ్డారు. నెలకు రూ.6,500 కోట్లు ముఖ్యమంత్రి కేటీఆర్ నాయకత్వం అని తడబడి.. మల్లీ రేవంత్ రెడ్డి అంటూ సంబోధించారు.
అవును.. మాజీ మంత్రి కేటీఆర్ చెప్పినట్లు మేము అన్ని హామీలు అమలు చేయలేదు. ఆలస్యం అయిందన్న మాట వాస్తవం. తులం బంగారం రూ.2500, పెన్షన్ లాంటివి అమలు చేయలేదు.. అది వాస్తవం అని తెలిపారు. ప్రస్తుతం మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరోవైపు జగ్గారెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరు మరిచిపోవడం గమనార్హం. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తడబడ్డాడు జగ్గారెడ్డి.
ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన మంత్రి జూపల్లి కృష్ణారావు https://t.co/FbA8uUig3n pic.twitter.com/W0vAuuk5aP
— Telugu Scribe (@TeluguScribe) February 18, 2025