పుష్ప 2 సినిమా ఏముంది..? ఎర్రచంద్రనం దొంగే కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నారాయణ. పుష్ప సినిమా ఏముంది..? ఒక ఎర్రచందనం దొంగ నీ హీరో గా చూపించి… దాన్ని యువత మీద రుద్దుతున్నారన్నారు. హీరోయిన్ రష్మికకు… ఫీలింగ్స్ పాటకు డాన్స్ చేయడం ఇష్టం లేదు.. కానీ డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చింది అని చెప్పిందంటూ బాంబ్ పేల్చారు.
అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాభిమానం చంపుకుని పని చేస్తున్నారని ఆగ్రహించారు. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి 2 కోట్లు కాదు ఐదు కోట్లు ఇచ్చిన ప్రాణాలు తెచ్చి ఇవ్వలేరని ఫైర్ అయ్యారు. ఇవాళ సినీ ప్రముఖులతో సిఎం సమావేశం ఉంది… ప్రభుత్వం కూడా… ప్రజల పై భారం మోపకుండా చూడండి అంటూ కోరారు. టికెట్ల ధరలు పెంచితే బ్లాక్ మార్కెట్ ప్రోత్సహించినట్టు లెక్క అని ఆగ్రహించారు. ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వహించేలా చర్చలు ఉండాలని కోరారు సీపీఐ నారాయణ.