తెలంగాణ రైతులకు షాక్‌..7 ఎకరాలకే రైతు బంధు !

-

Rythu Bharosa Guidelines prepared by Telangana Govt: తెలంగాణ రైతులకు షాక్‌ ఇచ్చేందుకు రేవంత్‌ రెడ్డి సర్కార్‌ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏడెకరాల వరకే రైతుబంధు లిమిట్ పెట్టే ఛాన్సులు ఇన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు రైతుబంధు కట్ అయ్యే ఛాన్స్‌ ఉందని సమాచారం. ఈ మేరకు రైతు భరోసా మార్గదర్శకాలు సిద్దం చేసిందట తెలంగాణ ప్రభుత్వం.

Rythu Bharosa Guidelines prepared by Telangana Govt

అంతేకాదు…. పీఎం కిసాన్ తరహాలోనే కఠిన నిబంధనలు పెట్టే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
కుటుంబంలో ఎంతమంది పేరిట భూమి ఉన్నా అందరిదీ ఒకే లెక్కన కట్టి కుటుంబం యూనిట్ లాగా తీసుకొని గరిష్టంగా ఏడెకరాల వరకే రైతుబంధు పరిమితం చేసి అంతవరకే రైతు భరోసా ఇచ్చేందుకు సిద్దమవుతోందట రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news