BREAKING : సీపీఎం పార్టీ తొలి జాబితా విడుదల

-

సీపీఎం పార్టీ తొలి జాబితా విడుదల అయింది. కాసేపటి క్రితమే సిపిఎం తొలి జాబితా విడుదల చేసింది. 14 మంది అభ్యర్థులతో జాబితాలో చోటు కల్పిస్తూ…సిపిఎం తొలి జాబితా విడుదల చేసింది. పాలేరులో తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి బరిలో ఉండనున్నారు. కాంగ్రెస్ తో సిపిఎం పొత్తు కొలిక్కిరాని సంగతి తెలిసిందే.

మరోవైపు ఇవాళ కాంగ్రెస్ మూడో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక అటు తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు 140 నామినేషన్లు దాఖలు అయ్యాయి. తొలి రోజుతో కలిపి మొత్తంగా 234 నామినేషన్లు నమోదయ్యాయి. నిన్న దాఖలు చేసిన వారిలో బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, యాదయ్య, హర్షవర్ధన్, కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు, పొంగులేటి, బీజేపీ నుంచి రాజాసింగ్, రమేష్ రాథోడ్ తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version