రాష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పంట చేల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
రైతుల కళ్లలో కన్నీరు, ఆవేదన చూశాం అన్నారు. ఈ ప్రభుత్వం తీసేది పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లు తెరవండి.ప్రాజెక్టుల గేట్లు తెరిస్తే.. రైతులకు పంటలు మంచిగా పండుతాయి. పార్టీ గేట్లు తీస్తే.. ఎవ్వరికీ లాభం జరుగుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారు కేసీఆర్. రైతులను ఏనాడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను ప్రవేశపెట్టి రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు, రైతుల ఇబ్బందులు మొదలయ్యాయని తెలిపారు.