ఈ ఏడాది రూ.42,499 కోట్ల పంట రుణాలు.. ఎస్‌ఎల్‌బీసీ వెల్లడి

-

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.42,499 కోట్ల మేరకు స్వల్పకాలిక పంట రుణాలు ఇచ్చినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) వెల్లడించింది. తెలంగాణలోని బ్యాంకుల ద్వారా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పెట్టుబడుల కోసం రూ.31,843 కోట్ల మేరకు రుణాలు ఇచ్చినట్లు తెలిపింది. వ్యవసాయ మౌలిక వసతుల నిధి ద్వారా ఈ ఏడాది రూ.872 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపింది. మొత్తం లక్ష్యంలో 62.62 శాతం సాధించినట్లు వివరించింది.

ప్రధానమంత్రి ముద్ర యోజనలో రూ.5,110 కోట్ల మేరకు రుణాలిచ్చినట్లు, మొత్తం లక్ష్యంలో 57 శాతం సాధించినట్లు ఎస్‌ఎల్‌బీసీ వివరించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం రూ.66,728 కోట్ల రుణసాయం అందించింది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో అత్యవసర పూచీ రుణ పథకం కింద రూ.10,342 కోట్లు మంజూరు చేసి.. అందులో ఇప్పటివరకు రూ.9,571 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.485 కోట్ల విద్యా రుణాలు, రూ.2,595 కోట్ల గృహ రుణాలను ఇచ్చినట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి స్వనిధి పథకంలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. అగ్రస్థానం సాధించేందుకు ప్రైవేటు రంగ బ్యాంకులు రుణసాయం పెంచాలని ఎస్‌ఎల్‌బీసీ సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version