విద్యుత్ వినియోగదారులపై మరింత భారం వేసేందుకు డిస్కం లు సిద్ధమయ్యాయి. చార్జీలను పెంచకుండా ఇందన ధర సర్దుబాటు చార్జిని కరెంట్ బిల్లులు అదనంగా వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కరెంటు బిల్లులలో ఈ చార్జీలను కలపాలని నిర్ణయించాయి. యూనిట్ పై 30 పైసలు ఎఫ్సిఏ వసూలు చేయాలని భావిస్తున్నాయి.
ఇంధన, బొగ్గు ధరల ఆధారంగా యూనిట్ పై 30 పైసలు వసూలు చేయనున్నట్లు డ్రాఫ్ట్ ఫైల్ లో డిస్కమ్ లు పేర్కొన్నాయి. ఎఫ్ సి ఏ చార్జీల రూపంలో విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.22,000 కోట్ల వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. డిస్కంల ప్రతిపాదనలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ కూడా ఆమోదం తెలిపింది. నెలవారీగా ఖాతా వివరాలను సమర్పించాలని డిస్కంలకు TSERC ఆదేశించింది. డిస్కంల ప్రతిపాదనకు TSERC ఆమోదం తెలపగా, ప్రభుత్వం కూడా ఆమోదించలేదు.