ముగిసిన కృష్ణ బోర్డు రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం

-

గత శనివారం హైదరాబాదులోని జల సౌధాలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కమిటీ భేటీ అయిన విషయం తెలిసిందే. చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సమావేశం శనివారం ప్రారంభమైంది. బోర్డు అధికారి రవికుమార్ పెళ్లి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం నేడు మరోసారి జరగగా.. ఈ సమావేశానికి తెలంగాణ గైర్హాజరు కావడం పట్ల క్రమశిక్షణ రహిత్యంగా భావిస్తున్నామని అంది కేఆర్ఎంసి.

తెలంగాణ క్రమశిక్షణ రాహిత్యం పై కేఆర్ఎంబికి లేఖ రాస్తామని తెలిపింది ఆర్ఎంసి. శనివారం జరిగిన ఆర్ఎంసి మీటింగ్లో ప్రాజెక్టు నిండి కిందికి పోయే రోజుల్లో మినహా మిగతా రోజులలో లభ్యమయ్యే నీళ్లు సాగు, తాగు అవసరాలు ఉంటేనే దాన్ని రివ్యూ చేసి పవర్ జనరేషన్ కు అనుమతి ఇస్తుందని తెలిపింది. శనివారం జరిగిన మీటింగ్ రూల్ కర్వ్ ( ఆపరేషన్ ప్రోటోకాల్) కి అంగీకరించిన తెలంగాణ ఈరోజు హాజరు కాలేదని తెలిపింది. దీన్ని ఆ రాష్ట్ర క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణిస్తూ కేఆర్ఎంబికి నివేదించాలని ఆర్ఎంసి నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news