గాంధీ భవన్లో కరెంట్ కట్.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటికీ హైదరాబాద్ వాసుల కరెంట్ కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. గత కొంత కాలంగా తరచూ విద్యుత్ కోతలు, జంట నగరాలను వేధిస్తూ వస్తున్నాయి. డిమాండ్ కి అనుగుణంగా విద్యుత్ సరఫరా అందడం లేదనేది ప్రధాన ఆరోపణ. నెట్ వర్క్ లోపాలు సైతం ఇబ్బందికరంగా మారాయి. విద్యుత్ కోతల ప్రభావం హైదరాబాద్ కి మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడిందనడానికి ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలే నిదర్శనం.

ప్రజావాణి కార్యక్రమంలో కూడా కరెంట్ కష్టాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన రోజులు కూడా ఉన్నాయి. ట్రాన్స్ ఫార్మర్లు తరచరూ కాలిపోయే ఉదంతాలు తరచూ చోటు చేసుకుంటూ వస్తున్నాయి. మంత్రి సీతక్కకు కరెంట్ కష్టాలు తప్పలేదు. సీతక్క విలేకర్ల సమావేశంలో మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా కరెంట్ సరఫరా స్థంబించిపోయింది. దీంతో కొద్దిసేపు ఆమె చీకట్లో గడపాల్సి వచ్చింది. ప్రెస్ మీట్ ను సైతం నిలిపివేయాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ గాంధీ భవన్ లో చోటు చేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపై సీతక్క మాట్లాడుతున్న సమయంలోనే కరెంట్ పోయింది. విద్యత్ సరఫరా గాంధీ భవన్ లో మాత్రమే స్థంబించిందని.. సిటీలో ఎక్కడా లేదని మంత్రి వివరణ ఇచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news