తుపాను వల్ల జిల్లాలో విద్యుత్ శాఖకు రూ.10 కోట్ల మేర నష్టంజరిగింది అని నెల్లూరు ట్రాన్స్ కో ఎస్.ఈ. విజయన్ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సాయంత్రం లోగా నెల్లూరు నగరానికి విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. అనంతరం మునిసిపాలిటీలు..మండల కేంద్రాలకు సరఫరా పునరుద్ధరిస్తాం. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ స్తంభాలను నాటుతున్నాం.ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని తెలిపారు.
మరోవైపు మచిలీపట్నం బీచ్ లో ఎగసిపడుతున్నాయి రాకాసి అలలు. మిచాంగ్ తుఫాన్ తీరం దగ్గరకి చేరుకోవడంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. తీరంలో 70 కిలో మీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో హై అలెర్ట్ కావాలని సూచించారు. హంసల దీవి బీచ్ లో కూడా ఎగసి పడుతున్నాయి సముద్ర అలలు. రెండు బీచ్ లల్లో కూడా హై అలెర్ట్ ప్రకటించారు పోలీసులు. జిల్లాల్లో 7 మండలాల్లో తుఫాన్ ఎఫెక్ట్ వాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది అధికార యంత్రాంగం.