దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లంలకు హైకోర్టులో ఎదురుదెబ్బ !

-

బీఆర్‌ఎస్‌ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. తాజాగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు మరోసారి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. BRS నుండి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్ట్‌ డివిజన్‌ బెంచ్‌ స్పష్టమైన ప్రకటన చేసింది.

brs rebal

ఈ నెల 24న వాదనలు వింటామన్న డివిజన్‌ బెంచ్‌… ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఇక షెడ్యూల్‌ ఖరారు చేయాలని ఉత్తర్వులు వెలువరించింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. అటు సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేశారు అసెంబ్లీ కార్యదర్శి. దానం, కడియం, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని.. గతంలో హైకోర్టును ఆశ్రయించింది బీఆర్‌ఎస్. దీంతో మరో పది రోజుల్లో… దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే సభ్యత్వంపై వేటు పడే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news