కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన దీక్షల తేదీలు ఖరారు

-

రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది. టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన దీక్షల తేదీలను పిసిసి ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న నల్గొండ ఎం.జి యూనివర్సిటీలో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే దీనిపై ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిరుద్యోగ నిరసన సభను రద్దు చేశారు. ఈ దీక్షని ఈనెల 28వ తేదీకి వాయిదా వేశారు. 24వ తేదీన ఖమ్మం, 26న ఆదిలాబాద్, 30న మహబూబ్నగర్, మే 1న రంగారెడ్డి జిల్లాలలో నిరుద్యోగ సభలు నిర్వహిస్తామని ప్రకటించింది పిసిసి. మరోవైపు ఈనెల 24న ఖమ్మంలో జరగనున్న నిరుద్యోగ బహిరంగ సభ పై చర్చించేందుకు రేణుక చౌదరి నివాసంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news