బీజేపీని టార్గెట్ చేసిన తమ్ముళ్ళు..పవన్‌కు సపోర్ట్!

-

ఏపీలో రాజకీయాలు నిదానంగా మారుతున్నాయి..అధికార వైసీపీకి ధీటుగా టి‌డి‌పి ముందుకెళుతుంది. అయితే పొత్తుల అంశంలో కాస్త ఆలోచనలో ఉన్న టి‌డి‌పి..జనసేన, బి‌జేపిలతో కలిసి ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ-బి‌జే‌పిల మధ్య రహస్య స్నేహం కొనసాగుతున్న నేపథ్యంలో టి‌డి‌పితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని బి‌జే‌పి నేతలు అంటున్నారు. ఇటు టి‌డి‌పి సైతం బి‌జే‌పితో పొత్తు ఉంటే తమకే నష్టమని అంచనా వేస్తుంది.

కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉండటంతో కాస్త ఆలోచనలో ఉంది. కానీ వైసీపీకి ఎప్పటికప్పుడు సహకరిస్తున్న బి‌జే‌పిపై టి‌డి‌పి నేతలు కూడా ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు. వైసీపీ-బి‌జే‌పిల మధ్య సంబంధం ఉందో లేదో ప్రజలకు తెలుసని,  నాలుగేళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ఏం చేశారని ఏపీ టి‌డి‌పి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అప్పులు, ఎఫ్ఆర్బిఎం విషయంలో ఏ రాష్ట్రానికి లేని వెసులుబాట్లు ఏపీకే వస్తున్నాయని, అది జగన్ అదృష్టమని, ఏప్రిల్ నెలలో ఏపీకి ఇవ్వాల్సిన అప్పును మార్చి నెలలోనే ఇచ్చేలా చేశారని అన్నారు.

ఇక రాష్ట్రంలో బిజెపి తప్పుడు రాజకీయం చేస్తుందని,  పవన్ కళ్యాణ్ టిడిపితో కలవడానికి ముందుకు వస్తుంటే బిజెపి భయపెడుతుందని,  టిడిపితో జనసేన పార్టీని కలవకుండా బిజెపి ఎంత కాలం అడ్డుకుంటుందో చూస్తామని టి‌డి‌పి సీనియర్ నేత పితాని సత్యనారాయణ కామెంట్స్ చేశారు. దీని బట్టి చూస్తే టి‌డి‌పి ఇంకా బి‌జే‌పితో పొత్తు కోసం ప్రయత్నించే అవకాశాలు ఏ మాత్రం లేవని తెలుస్తోంది.

పవన్ కలిస్తే..ఆయనని కలుపుకు వెళ్లడానికి రెడీగా ఉంది. ఒకవేళ పవన్ సైతం టి‌డి‌పితో పొత్తుకు ముందుకు రాకపోతే..టి‌డి‌పి ఒంటరి పోరుకే దిగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news