BREAKING : నేటి నుండి DAV పబ్లిక్ స్కూల్ రిఓపెన్

-

 

నేటి నుండి DAV పబ్లిక్ స్కూల్ రిఓపెన్ అయింది. దాదాపు 20 రోజుల తరువాత రిఓపెన్ అయింది స్కూల్. ఈ నేపథ్యంలోనే.. తమకు న్యాయం జరగకుండానే స్కూల్ ని ఎలా ఓపెన్ చేశారని స్కూల్ ఎదుట బైఠాయించారు బాధిత చిన్నారి తల్లిదండ్రులు. కనీసం స్కూల్ యాజమాన్యం తమ వద్దకు రాలేదని… చిన్నారి కి జస్టిస్ జరగకుండనే స్కూల్ ఎలా ఓపెన్ చేశారని ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు.

స్కూల్ క్లోజ్ చేయమని చెప్పలేదు.. స్కూల్ క్లోజ్ చేసి ఎందుకు రిఓపెన్ చేశారని మండిపడ్డారు.
బాధితులం మేము..కానీ మమ్మల్ని ఎవరు అడగకుండానే చిన్నారికి జస్టిస్ అవ్వకుండానే స్కూల్ ఎలా ఓపెన్ చేస్తారని నిలదీశారు చిన్నారి తల్లితండ్రులు. కనీసం ప్రభుత్వం తమ భాధ ను పట్టిచుకోలేదు…రిఓపెన్ పై మమల్ని కనీసం అడగలేదని ప్రశ్నించారు. నిందితులకు శిక్ష పడే అంతవరకు స్కూల్ క్లోజ్ చెయ్యాలని.. DAV స్కూల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ స్కూల్ ఎదుట బైఠాయించారు చిన్నారి తల్లిదండ్రులు.

Read more RELATED
Recommended to you

Latest news