రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ కారు గద్దె అర్ధరాత్రి కూల్చివేశారు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం గజసింగవరం స్టేజ్ రాజేశ్వర్ రావు నగర్ గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కారు గద్దెను అర్ధ రాత్రి కూల్చివేశారు.
కావాలనే చేస్తున్నారని గ్రామా మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. దీనిపై బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ఈ అంశాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక అటు నేడు కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘ ఛార్జ్ షీట్ ‘ విడుదల చేయనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ లో మండలి పక్షనేత మధుసూదనచారీ మరియు ఇతర మాజీ మంత్రులతో కలిసి ఛార్జ్ షీట్ విడుదల చేయనున్నారు.
బీఆర్ఎస్ కారు గద్దె అర్ధరాత్రి కూల్చివేత.
రాజన్న సిరిసిల్ల – గంభీరవుపేట్ మండలం గజసింగవరం స్టేజ్ రాజేశ్వర్ రావు నగర్ గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కారు గద్దెను అర్ధ రాత్రి కూల్చివేశారు.
కావాలనే చేస్తున్నారని గ్రామా మాజీ సర్పంచ్ ఆవేదన. @KTRBRS @BRSparty @BrsSircilla pic.twitter.com/4sgiHG7JP1
— Telangana First (@TelanganaFirst_) December 8, 2024