నేడు కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘ ఛార్జ్ షీట్ ‘ విడుదల చేయనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ లో మండలి పక్షనేత మధుసూదనచారీ మరియు ఇతర మాజీ మంత్రులతో కలిసి ఛార్జ్ షీట్ విడుదల చేయనున్నారు.
ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ ఏడాది పాలనపై చార్జ్ షీట్ విడుదల చేసిన అనంతరం హరీష్ రావు మాట్లాడతారు. ఇక అటు ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు ఎర్రవెళ్లిలోని ఫాంహౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశం ఉంటుంది.
ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల పైన కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయనున్నట్లుగా సమాచారం అందుతోంది. జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన కేసీఆర్ మాట్లాడుతారని సమాచారం. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పైన కేసీఆర్ సూచనలు చేస్తారని టాక్ వినిపిస్తోంది.