పన్నుల ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచండి అంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి కేంద్రాన్ని కోరారు. ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సెస్ లు, సర్ చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వండని కోరారు.
స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉన్నదని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేయడం మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించడానికి అవకాశం ఉందని తెలిపారు భట్టి. ఇది తెలంగాణ డిమాండ్ కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించినదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. చారిత్రిక కారణాలవల్ల అసమాన అభివృద్ధి ఇ క్కడ ఉన్నదని వెల్లడించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి. తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ సంపద, ఆదాయం పెద్ద అంతరం ఉందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి.