పంజాబ్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పయనం అవుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. ఫరీద్ కోట్ పార్లమెంటు నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకునిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు నియామకం అయ్యారు. ఈ తరుణంలోనే… పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
నేటి నుంచి మూడు రోజులపాటు స్థానికంగా ప్రచారం చేస్తారు డిప్యూటీ సీఎం భట్టి.
మెరుగైన సమన్వయం, ఎన్నికల నిర్వహణ గాను పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ పార్లమెంటు నియోజకవర్గం ప్రత్యేక పరిశీలకునిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ను ఏఐసీసీ నియమించింది. ఎన్నికల బాధ్యతలో భాగంగా బుధవారం ఉదయం ఆయన ఫరీద్ కోట్ కు బయలుదేరారు. నేటి నుంచి మూడు రోజులపాటు అక్కడే మకాం వేసి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయనున్నారు.