కాళేశ్వరం కమిషన్ నివేదిక పై డిప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ సచివాలయంలో ఇవాళ కేబినెట్ భేటీ ప్రారంభం అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ భేటీపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ మీటింగ్కు హాజరయ్యే ముందు కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నివేదిక చూస్తే కానీ ఏముందో తెలియదని భట్టి విక్రమార్క చెప్పారు.

0

కేబినెట్ లో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చ ఉంటుందని స్పష్టం చేశారు. నివేదికపై చర్చించిన తర్వాత ఏం చేయాలా? అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని భట్టి వెల్లడించారు. కేబినెట్ భేటీ అనంతరం ఈ నివేదికపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు అధికారుల సమాచారం. ఇక, బ్యారేజీల నిర్మాణానికి పూర్తి
బాధ్యత అప్పటి సీఎం కేసీఆరేనని కాళేశ్వరం కమిషన్ నివేదికల ద్వారా తేల్చిచెప్పింది. అవకతవకలు జరిగాయని రిపోర్టు రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news