మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. మినిస్టర్ క్యాంపు ఆఫీస్ కి ఇందిరా భవన్ గా నామకరణం చేశారు. ఆపై యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను భూమి పూజకు సంబంధించిన వివరాలను సీఎం కి వివరించారు.
ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్ చేయగా.. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారు. మీరు మరలా సీఎం కావాలని ప్రత్యేక పూజలు చేశానని సీఎం కి వివరించారు మంత్రి కోమటి రెడ్డి. అందుకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నకిరెకల్, మిర్యాలగూడ, నాగార్జున్ సాగర్ ఎమ్మెల్యేలతో కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.