టీామిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ 5వ టెస్ట్ లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 224, రెండో ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 247, రెండో ఇన్నింగ్స్ లో 367 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇవాల 35 పరుగులు చేస్తే.. ఇంగ్లాండ్ జట్టు విజయం సాధిస్తుంది. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. అంతా ఇంగ్లాండ్ విజయం సాధిస్తుందని భావించారు. కానీ భారత బౌలర్లు ప్రసిద్, సిరాజ్ కట్టుదిట్టమైన బంతులు వేయడం.. వికెట్లు తీయడంతో టీమిండియా విజయం సాధిస్తుందని అనే నమ్మకం కలిగించారు. మరోవైపు వోక్స్ ఒంటి చేతితో బ్యాటింగ్ చేసేందుకు వచ్చాడు. కానీ ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేదు. దీంతో అట్కిన్ న్సన్ 17 పరుగులు చేసి పోరాడాడు. కానీ సిరాజ్ వేసిన యార్కర్ కి బోల్తా పడటంతో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.