తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తి పరిణామాలు

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం చివరి తేదీ కావడం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొంత మంది రెండు సీట్లకు పోటీ చేస్తే.. మరికొందరూ ఒక్క సీటుకు పోటీ చేయడం లేదు. కొంత మంది పోటీ చేయని వారికి ఢిల్లీ అధిష్టానం నుంచి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. 

ఇప్పటివరకు పోటీ చేసుకున్న ప్రధాన లీడర్లను పరిశీలించినట్టయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోడంగల్, భట్టి విక్రమార్క మధిర, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, కోదాడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి తదితర స్థానాల్లో పలువురు పోటీ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. నాగార్జున సాగర్ సీటుకు జానారెడ్డి పోటీ చేయడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మిర్యాలగూడ, నాగార్జున సాగర్ టికెట్ కోసం జానా పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి దరఖాస్తు చేశారు. మరోవైపు ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఊహించని విధంగా నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.

కరీంనగర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్  సోదరుడు రంగారావు కుమార్తె రమ్యారావు, ఆమె కుమారుడు రితీష్ రావు దరఖాస్తు చేశారు. ముషీరాబాద్ టికెట్ కోసం కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్, ఆయన కొడుకు అనిల్ కుమార్ యాదవ్ అర్జి పెట్టుకున్నారు. ఎమ్మెల్యే సీతక్క పీఏ సుధీర్ పినపాక సీటు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మరోవైపు చాలా రోజుల తరువాత మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news