ఆరోగ్యానికి జీలకర్ర చాలా మేలు చేస్తుందని మనకి తెలుసు అయితే నల్ల జీలకర్ర కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది నల్ల జీలకర్రతో ఎన్నో లాభాలను పొందొచ్చు. నల్ల జీలకర్ర వలన ఎలాంటి లాభాలు పొందొచ్చు అనేది చూద్దాం. నల్ల జీలకర్ర ని తలకు చర్మానికి రాసుకున్నట్లయితే ప్రోటీన్స్ రక్తప్రసరణకు తోడ్పడతాయి. దాంతో జుట్టు బాగా పెరుగుతుంది చర్మానికి కూడా రాసుకోవచ్చు. జుట్టుకి రాసుకున్నట్లయితే చుండ్రు బాధ పోతుంది జుట్టు దృఢంగా ఉంటుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపును కూడా నల్ల జీలకర్ర పోగొడుతుంది.
పరగడుపున ఒక అర టీ స్పూన్ నల్ల జీలకర్రను తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది నల్ల జీలకర్ర నూనెని తేనె ని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే ఆస్తమా ఉండదు. జలుబు దగ్గు కూడా పోతాయి. నల్ల జీలకర్రతో తయారుచేసిన నూనె నుదుటిమీద రాసుకున్నట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది. నల్ల జీలకర్ర తీసుకుంటే మలబద్ధకం కూడా ఉండదు నల్ల జీలకర్రను తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ సమస్య కూడా ఉండదు.
నల్ల జీలకర్రతో క్యాన్సర్ కి కూడా దూరంగా ఉండొచ్చు నల్ల జీలకర్ర వలన మొటిమలు కూడా పోతాయి కాబట్టి ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక కచ్చితంగా నల్ల జీలకర్రని వాడండి. నల్ల జీలకర్రని మనం చాలా వాటిలో వాడుకోవచ్చు రెస్టారెంట్లలో అయితే రోటీ పాస్తా వంటి వాటిల్లో గార్నిష్ కోసం వాడుతూ ఉంటారు. మనం తాలింపు పెట్టుకునేటప్పుడు నల్ల జీలకర్రని వేసుకోవచ్చు నల్లజీలకర్రని ఆహారంగా తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నల్లజీలకరని తీసుకుంటూ ఉండండి.