తెలంగాణలో బెటాలియన్ పోలీసుల కుటుంబాలు గత కొద్ది రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం పై డీజీపీ జితెందర్ స్పందించారు. క్రమశిక్షణ కూడిన ఫోర్స్ లో ఉంటూ ఆందోలనలు చేయడం సరికాదు అన్నారు. ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమాలలో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో డీజీపీపీ జితెందర్ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేశారు. సెలవులపై పాత పద్దతే అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళనలకు దిగడం సరికాదని కాస్త సీరియస్ అయ్యారు. ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం ఉందన్నారు. ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరిత్యా చర్యలుంటాయని స్పష్టం చేశారు. మన దగ్గర ఉన్న రిక్రూట్ మెంట్ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు.