ధరణి సాఫ్ట్‌వేర్‌తోపాటు చట్టాలూ మార్చాల్సిందే : ధరణి కమిటీ

-

ధరణి పోర్టల్ వ్యవస్థ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చేట్లు లేదని ధరణి కమిటీ తేల్చింది. సచివాలయంలో బుధవారం రోజున కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించింది. ఈ క్రమంలో కమిటీ దృష్టికి అనేక లోపాలు వచ్చినట్లు సమాచారం. సిద్దిపేట, వరంగల్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో కమిటీ సమావేశమైన కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, న్యాయవాది సునీల్‌, సీఎంఆర్ఓ డైరెక్టర్‌ లచ్చిరెడ్డి, మాజీ జాయింట్‌ కలెక్టర్‌ మధుసూదన్‌లు 35 మ్యాడ్యూల్స్‌ ప్రజలకు ఉపయోగపడేట్లు లేవని తెలిపారు. 18 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తుండగా.. 23 లక్షలు ఎకరాలు పార్ట్‌-బిలో ఉన్నట్లు కమిటీ దృష్టికి వచ్చినట్లు సమాచారం. కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించిన కమిటీ… ఈనెల 27న గిరిజన, అటవీ, వ్యవసాయ శాఖల అధికారులతో సమవేశం కావాలని నిర్ణయించింది.

ఈ భేటీలో ధరణి సాఫ్ట్‌వేర్తో పాటు చట్టాలను సైతం మార్చాలని కమిటీ నిర్ణయానికి వచ్చిటన్లు సమాచారం. పోర్టల్‌ సవరణ మార్గదర్శకాలు, చట్టబద్దత లేకపోవడంపై కలెక్టర్లను ప్రశ్నించిన కమిటీ నిర్వహణ సంస్థ టెర్రాసిస్‌ ప్రతినిధులతోనూ సుదీర్ఘంగా చర్చించింది. ధరణి సాఫ్ట్‌వేర్‌ మాడ్యుల్స్‌ ఎలా పనిచేస్తున్నాయి..? దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు ఎలా పని చేస్తుంది..? ఎదురవుతున్న సమస్యలపై లోతుగా ఆరా తీసింది. చివరకు సాఫ్ట్‌వేర్‌లో మరిన్ని మాడ్యుల్స్‌ అవసరమని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news