Konatham Dilip Kumar: BRSకు బిగ్ షాక్.. పోలీసుల అదుపులో కొణతం దిలీప్ కుమార్ ఉన్నారు. నిన్న రాత్రి కొణతం దిలీప్ కుమార్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. బీఆర్ఎస్ హయాంలో డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పని చేశారు దిలీప్. ప్రభుత్వాని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గతంలో అరెస్ట్ కాగా.. బెయిల్ పై విడుదల అయ్యారు.

ఇక తాజాగా వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికాకు వెళ్లి తిరిగి వస్తున్న కొణతం దిలీప్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో అరెస్ట్ చేశారు. ఇది ఇలా ఉండగా మే 18వ తారీఖు నాడు తన తండ్రి కొణతం బక్కా రెడ్డి జ్ఞాపకార్ధం కుటుంబసభ్యులు ప్రచురించిన పుస్తక ఆవిష్కరణ అమెరికాలోని వర్జీనియాలో ఉన్నందున హైకోర్టు అనుమతి తీసుకుని అమెరికా వెళ్లి తిరిగి వస్తుండగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఈ చర్య ద్వారా పోలీసులు నేరుగా హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని కొణతం దిలీప్ న్యాయవాది అన్నారు.