ఒక్క రోజుగ్యాప్ తర్వాత తెలంగాణ శాసనసభ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈవేళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఈరోజు నుంచి శాసనసభలో బడ్జెట్ పద్దులపై వాడివేడి చర్చ జరగనుంది. ఇవాళ మొత్తం 19 పద్ధులపై శాసనసభలో చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఈ పద్దులను సభలో ప్రవేశపెడతారు.
ఇందులో ప్రధానంగా ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పరిశ్రమల, ఐటి, ఎక్సైజ్ హోం, కార్మిక ఉపాధి,రవాణ, బిసీ సంక్షేమం, పాఠశాల విద్యా, ఉన్నత విద్యా, సాంకేతిక విద్యా, మెడికల్ అండ్ హెల్త్ తదితర 19 పద్దులపై చర్చించి ఆమోదం తెలపనుంది. ఈ పద్ధులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు సభలో ప్రవేశపెట్టనున్నారు.