తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలమయ్యాయి. స్టైఫండ్ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ప్రతినెలా 15వ తేదీ వరకు స్టైఫండ్ వచ్చేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హాస్టళ్లలో వసతులు కల్పించడంతో పాటు కొత్త హాస్టల్స్ నిర్మిస్తాం అని మంత్రి అన్నారు.
ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మాణం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు మంత్రి. రెండు నెలల్లో ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. nmc రూల్ ప్రకారం అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెల స్టైఫండ్ లో రెండు నెలల స్టైఫండ్ రిలీజ్ చేశారు. సమ్మె పై జూనియర్ డాక్టర్లలందరితో కలిసి సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు.