దేశంలోనే అతి పెద్ద కుంభకోణం నెల్లూరు జిల్లాదే : టీడీపీ నేత సోమిరెడ్డి

-

నెల్లూరు జిల్లాలో ఐదు వేల కోట్ల రూపాయల విలువైన సిలికా.. 3 వేల కోట్ల విలువైన తెల్లరాయిని
దోచేశారు అని టిడిపి నేత సోమిరెడ్డి  ఆసక్తికర  కామెంట్స్ చేశారు. దేశంలోనే ఇది ఒక పెద్ద కుంభకోణం, సెంట్రల్ విజిలెన్స్ తో పాటు అధికారుల అందరికీ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరాం. మైనింగ్ లేచి దారులకు రెన్యువల్ చేయకుండా వైసీపీ నేతలు వాటిలో అక్రమంగా తెల్ల రాయిని తవ్వుతున్నారు. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా ఇంతవరకు అధికారులు స్పందించలేదు అన్నారు.

అక్కడికి వెళ్లి మళ్లీ చూడగా 14 హిటాచీలు..జిలేటిన్ స్టిక్స్..ట్రక్స్.. ను పెట్టి మైనింగ్ చేస్తున్నారు. బ్లాస్టింగ్ చేస్తుండడంతో చుట్టుపక్కల ఉండే గిరిజనులు భయపడా దగ్గరవుతున్నారు. పేలుడు పదార్థాలను భద్రత లేకుండా నిల్వ ఉంచారు. కలెక్టర్ ఎస్పీలు ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కే వాటాలు ఇస్తున్నారు. ఒక్కో మండలాన్ని మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఇన్చార్జీలు పంచుకున్నారు. లీజు.. పర్మిట్ లేకుండా ఇంత దోపిడీ చేస్తున్నా ఎవరూ స్పందించడం లేదు. కె.జి.ఎఫ్.3 లాగా దోచుకుంటున్నారు.దానిని వహూసి అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలని నేను నిరసన కార్యక్రమాన్ని చేపడితే దానిని కూడా భగ్నం చేశారు. నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా నన్ను తరలించారు.నా నిరసన భగ్నం చేసేందుకు హిజ్రాలను తీసుకువచ్చారు. రౌడీలను పంపించి.. నా కారు అద్దాలను ధ్వంసం చేశారు. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఇంతటి ఘోరాన్ని చూడలేదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version