గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రజలకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. నేడు 17,676 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది కేసీఆర్ సర్కార్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ 17,676 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
మూడవ విడతలో భాగంగా ఈనెల 2న 19,020 మంది లబ్ధిదారులకు ఇళ్ళను పంపిణీ చేయగా, మిగిలిన 17,676 ఇళ్లను నేడు 7 ప్రాంతాల్లోని లబ్ధిదారులకు అందజేయనున్నారు. కాగా, మొదటి విడతలో 11,700 మందికి, రెండవ విడతలో 13,200 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.
కాగా, డెయిరీ రంగంలో తెలంగాణను మరింత అభివృద్ధి మార్గంలో నడపడానికి రాష్ట్ర సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డెయిరీలు ఏర్పాటు చేసి పాడి రైతుల ప్రగతికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద నిర్మించిన తెలంగాణ విజయ ఫెడరేషన్‌కు చెందిన మెగా డెయిరీ ఇవాళ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ మెగా డెయిరీని ప్రారంభించనున్నారు.