రేపు గ్రేటర్ హైదరాబాద్ లో మూడో విడుత డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ

-

తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ మూడో విడుత డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ అక్టోబర్ 02న చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రెండు విడుతల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ చేసింది. తాజాగా మూడో విడుత కార్యక్రమం చేపట్టనుంది. గ్రేటర్ హైదరాబాద్ లో సోమవారం మూడో విడుత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీని పలువురు మంత్రులు చేపట్టనున్నారు. ముఖ్యంగా మూడు విడుతల్లో సోమవారం 19,020 మందికి ఇండ్లను అందించనుంది ప్రభుత్వం.

కొల్లురు 2లో 6,067 ఇండ్లను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేయనున్నారు. రాంపల్లిలో 3,214 లబ్దిదారులకు ఇళ్లను పంపిణీ చేయనున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దుండిగల్ లో రాష్ట్రం హోంమంత్రి మహబూద్ అలీ 3,142 ఇళ్లను అందించనున్నారు. మన్ సాన్ పల్లిలో 2,099 ఇండ్లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేయనున్నారు.  అదేవిధంగా శంకర్ పల్లిలో 1,361 ఇళ్లను మంత్రి మహేంధర్ పంపిణీ చేయనున్నారు. నల్లగండ్లలో 344 ఇళ్లను పద్మారావు గౌడ్ పంపిణీ చేయనున్నారు. అలాగే నార్సింగిలో 356 ఇళ్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అందించనున్నారు. అహ్మద్ గూడలో 1,965 మంది లబ్దిదారులకు ఇళ్ల పంపిణీ చేయనున్నారు మంత్రి మల్లారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version