BREAKING: మెదక్ జిల్లా విద్యార్థులకు బిగ్ అలర్ట్. మెదక్ జిల్లాలో నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. మెదక్ జిల్లాకు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. దీంతో ఇండ్లకు పరిమితం కానున్నారు విద్యార్థులు.

ఇక అటు మెదక్ లోని ఏడు పాయల వనదుర్గ మాత మూడో రోజు జలదిగ్బంధంలోనే ఉంది. మంజీరా బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయడంతో ఏ క్షణాన అయిన భారీ వరద వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అమ్మవారి ఆలయం చుట్టూ ఉగ్రరూపం దాల్చింది మంజీరా నది. అమ్మవారి పాదాలను తాకుతూ ఏడు పాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతోంది మంజీరా. గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు అందుకుంటున్నారు అమ్మ వారు.