మునుగోడు ఉప ఎన్నికపై ఈటల మాట్లాడింది నూటికి నూరుశాతం వాస్తవమని ఆగ్రహించారు డీకే అరుణ. మునుగోడు లో కాంగ్రెస్ అభ్యర్థికి TRS సహకరించింది… ఆర్థిక సహాయం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా కెసిఆర్, కేటీఆర్ మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. కాంగ్రెస్ కు వత్తాసు పలకడం లో ఆంతర్యమేంటి అని నిలదీశారు.
వాస్తవాలు మాట్లాడితే రేవంత్ కు అంత ఉలిక్కిపాటు ఎందుకు అని నిలదీశారు. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్, brs ఒక్కటి అయింది వాస్తవం కాదా అని నిలదీశారు. ఓటుకు నోటు పైన కూడా భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర ప్రమాణం చేస్తావా… ఈటెల రాజేందర్ పైన నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదని చురకలు అంటించారు. సోదర రేవంత్… వాస్తవాలు జీర్ణించుకోలేక పోతే ఎలా అని నిలదీశారు. మీ పార్టీ లోని వారే BRS తో లోపాయి కారి ఒప్పందం పెట్టుకున్నారని నువ్వు అన లేదా అని ఆగ్రహించారు డీకే అరుణ.