వారెంటీ లేని పార్టీ గ్యారెంటీ ఇస్తా అంటే నమ్ముతామా : మంత్రి కేటీఆర్

-

వారెంటీ లేని పార్టీ గ్యారెంటీ ఇస్తా అంటే నమ్ముతామా అని మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సిరిసిల్ల జిల్లా గంభీరావు  పేటలో డబుల్ బెడ్ రూం పంపిణీ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు.  65 ఏండ్లు ఏమివ్వనోడు అంట.. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇస్తాడట.. సాగు నీరు ఇవ్వలేదు. పింఛన్ ఇవ్వలేదు. కాంగ్రెస్ గెలిచేది లేదు.. సచ్చేది లేదు. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 సార్లు రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తుంచుకోండి. కాంగ్రెస్ వస్తే దిక్కుమాలిన రోజులు వస్తాయన్నారు.  

కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్ లు గురించి వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..  6 గ్యారెంటీ స్కీమ్ లు ఏమోకానీ.. ఈ 6 కష్టాలు మాత్రం రావడం పక్కా అని తెలిపారు.  కరెంట్ కష్టాలు, మంచినీటి కష్టాలు.., ఎరువులు విత్తనాల కష్టాలు.. , ఐదుగురు ముఖ్యమంత్రులు మారడం,  గంభీర్ మున్సిపాలిటీ చేస్తా అన్న కదా.. అది గ్రామంగానే ఉంటదని,  ఆడ బిడ్డలు కష్టాలను తీర్చదని 6 గ్యారెంటీ స్కీమ్ ల గురించి చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్. రైతులకు కరెంట్ కష్టాలు.. కాంగ్రెస్ వస్తే అంధకారమవుతుందని.. మొండిచేయికి ఓటు వేస్తే.. తెలంగాణ వెనక్కి వెళ్తుందని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్.  

Read more RELATED
Recommended to you

Latest news