ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో రోగులను పట్టించుకోని వైద్యులు..!

-

సాధారణంగా ఎవరికైనా ఏ ఆపద వచ్చినా ఆసుపత్రికి వెళ్తుంటారు. తాజాగా ఆపద వచ్చిందని ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్ళితే ఓ మహిళ పై డ్యూటీ డాక్టర్లు వృత్తి ధర్మాన్ని మరిచి ముచ్చట్లు పెట్టుకుంటూ.. పేషేంట్ ను పట్టించుకోని సంఘటన జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. బాధితులు తెలిసిన వివరాల ప్రకారం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన బి.వెంకటమ్మ (70) కూలి పనిలో భాగంగా పొలంలో పనికి వెళితే పాము కాటు వేసింది.

దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళితే ఓపి రాయడానికి సుమారు 15 నిమిషాలు.. ఆ తరువాత మళ్ళీ లోపలికి వెళితే టెస్టు చేయించుకొని రండి అంటూ ఆ తర్వాత ఫైల్ తీసుకొని రండి అంటూ టైం వేస్ట్ చేసిన ముగ్గురు డాక్టర్లు ఒకే చోట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుతున్నారని బాధిత మహిళ వాపోయింది. కనీసం పాము కరిచి నడవలేని స్థితిలో ఉన్న మహిళను కుర్చీలోంచి లేచి వచ్చి చూడరా మేడం అని అడిగితే అరవకండి అంటూ.. దురుసుగా సమాధానం చెప్పడంతో పాటు పేషేంట్ తరపు బంధువుల పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news