శంషాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..!

-

శంషాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు.. రూ. 7 కోట్లు విలువ చేసే కేజీ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ SOT, మాదాపూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. రాజస్థాన్ నుండి హైదరాబాద్కు హెరాయిన్ తీసుకువచ్చి విక్రయాలు జరుపుతుంది అంతర్రాష్ట్ర ముఠా. రాజస్థాన్ కి చెందిన నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మీడియాకు వివరాలు వివరించారు. పెద్ద మొత్తంలో హెరాయన్ పట్టుబడటం ఇదే మొదటిసారి అన్నారు. మొత్తం ఒక కేజీ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నాం.. దీని విలువ రూ. 7 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న నేమిచంద్ భాటి, నార్పట్ సింగ్, అజయ్ భాటి, హరీష్ సిర్వి, సంతోష్ ఆచార్య అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ బస్సులో తీసుకొచ్చారన్నారు. మరోవైపు.. ఆఫ్ఘనిస్తాన్ లోనే హెరాయిన్ ఎక్కువగా తయారు అవుతోందని సీపీ చెప్పారు. ఈ హెరాయిన్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నామని తెలిపారు. స్వీట్ బాక్సుల్లో పైన స్వీట్స్ పెట్టి.. కింద 250గ్రా. హెరాయిన్ ఉంచి సరఫరా చేస్తున్నట్లు సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news