14,15 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దు.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

-

తెలంగాణలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే 14,15 తేదీల్లో వసంత పంచమి సందర్భంగా 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని కోరుతున్నట్టు తెలిపారు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

మరోవైపు అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జోరుగా చర్చోప చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేఆర్ఎంబీ విషయంలో అధికార పక్షం వారి వాదనను వినిపిస్తుండగా.. ప్రతిపక్షం కూడా తమ వాదనను వినిపిస్తోంది. ఇరువురు వాదనలు అసెంబ్లీలో ఆసక్తికరంగా మారడం విశేషం. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు అంతా కలిసి మేడిగడ్డను సందర్శించడానికి వెళ్దామని చెబుతుండగా.. బీఆర్ఎస్ మాత్రం దీనిపై స్పందించకపోవడం గమనార్హం. ఈనెల 13న నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తుండటంతోనే కాంగ్రెస్ ఈ ప్లాన్ చేసిందని పలువురు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news