తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఒక్క రోజు గ్యాప్ తర్వాత తిరిగి మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి సమావేశాల్లో బడ్జెట్పై సాధారణ చర్చ జరుగుతోంది. సభ ప్రారంభం కాగానే మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనసభకు ముందుగా ఒక రిక్వెస్టు చేశారు. తాము మాట్లాడేటప్పుడు స్క్రీన్లు తిప్పొద్దని కోరారు. తాము అసెంబ్లీలో కనిపించడం లేదని జనాలు మాట్లాడుకుంటున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని హరీశ్ రావు అన్నారు. రూ.4.5 లక్షల లేని జీఎస్‌డీపీని రూ.14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. 1400 మెగావాట్లు రామగుండం నుంచి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించిన హరీశ్ రావు తమ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు కాదని.. ఆధారాలు చూపించాలని రాష్ట్ర ప్రభుతుత్వాన్ని డిమాండ్ చేశారు.