Driver died of heart attack while driving RTC bus: ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. ఈ తరుణంలోనే డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. గజ్వేల్ వద్ద హుజురాబాద్ RTC డిపోకి చెందిన డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు హుజురాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఛాతీలో నొప్పిగా ఉండటంతో బస్సు పక్కకు ఆపి ప్రయాణికులకు విషయం చెప్పాడు డ్రైవర్ రమేష్ సింగ్. ప్రయణికూలు ఆస్పత్రికి తరకిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ మృతి చెందాడు. బస్సులోని 45 మంది ప్రాణాలు కాపాడి ప్రాణాలు వదిలాడు రమేష్ సింగ్. దీనిపై ఆర్టీసీ అధికారులు విచారణ చేస్తున్నారు.