నేడు దుబ్బాక నియోజక వర్గం బంద్‌కు పిలుపు

-

నేడు దుబ్బాక నియోజక వర్గం బంద్‌కు పిలుపు నిచ్చారు. నిన్న మెదక్‌ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడికి నిరసనగా ఇవాళ దుబ్బాక నియోజకవర్గ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, బంద్ను విజయవంతం చేయాలని కోరింది బీఆర్‌ఎస్‌ పార్టీ.

కాగా ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్‌ రెడ్డిపై మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన గడ్డం రాజు (38) అనే వ్యక్తి క‌త్తితో దాడి చేశాడు. కాగా గడ్డం రాజు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతగా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news