తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. రైతుబంధు పంట పెట్టుబడి విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వ్యవసాయ శాఖ రంగంలోకి దిగింది. తక్కువ భూవిస్తీర్ణం ఉన్న రైతులకు తోలుత రైతుబంధు పంపిణీ చేస్తామని తెలిపింది.
ఈ నెల 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండగా… ఈ నెల 29, 30 తేదీల్లో పంపిణీకి ఈసీ అనుమతించలేదు. దీంతో ఈనెల 28న ఒకే రోజు రైతులందరి బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నగదు జమకానుంది. ఈ సీజన్ లో 70 లక్షల మందికి రైతుబంధు రానుంది.
కాగా, తెలంగాణ శాసనసభ సమరం కీలక దశకు చేరుకున్న వేళ రాష్ట్రానికి జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. తమ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ నుంచి ప్రధాని మోదీ సహా, అమిత్ షా, నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఇప్పటికే మూడు సార్లు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన మోదీ ఇవాళ మరోసారి రానున్నారు.