పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ.. రిటర్నింగ్ అధికారులకు ఈసీ వార్నింగ్

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్​ సమయం ఆసన్నమవుతోంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. మరోవైపు రాష్ట్ర ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే హోం ఓటింగ్ ప్రక్రియ జరుగుతుండగా.. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియనూ కొనసాగిస్తున్నారు. అయితే ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియను ఇవాళ పూర్తి చేయకపోతే సంబంధిత రిటర్నింగ్ అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హెచ్చరించారు.

పోస్టల్ బ్యాలెట్‌లకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై సీఈఓ సీరియస్‌గా స్పందించారు. 23వ తేదీ లోపు వచ్చిన దరఖాస్తులు అన్నింటినీ సంబంధిత ROలకు వెంటనే పంపాలని అదేశాలు జారీ చేశారు. దరఖాస్తులు చేసిన వెంటనే వాటిని పరిశీలించి పోస్టల్ బ్యాలెట్‌లను వెంటనే సదరు ROలకు పంపాలని చెప్పారు. ప్రక్రియ మొత్తం  ఇవాళ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గడువు లోగా ప్రక్రియ పూర్తి చేయని రిట్నరింగ్ అధికారులపై తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని వికాస్ రాజ్ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news