తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ లో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈఎస్ఐలో దాదాపు రూ.211 కోట్ల స్కామ్ జరిగినట్టు నిర్దారించింది ఈడీ. ఏసీబీ నమోదు చేసిన ఎనిమిది ఎఫ్ఐఆర్ ల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది ఈడీ. ఈ కేసులో దేవికారాణితో పాటు 15 మందిపై ఈడీ అభియోగాలు మోపింది. మెడికల్ పరికరాల కొనుగోలు పేరుతో అక్రమాలు జరిగినట్టుగా నిర్థారించింది.
ఇప్పటికే 144 కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. సర్జికల్ కిట్స్ తో పాటు మందుల సప్లై పేరుతో నిందితులు అక్రమాలకు పాల్పడ్డారు. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి నకిలీ ఇన్ వాయిస్ సృష్టించి పెద్ద మొత్తంలో లబ్ధి పొందారు. మెడికల్ క్యాంపుల పేరుతో నిధుల గోల్ మాల్ కి పాల్పడ్డారు. అక్రమ సంపాదనతో రూ.6కోట్ల విలువ చేసే బంగారాన్ని దేవికరాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మీ కొనుగోలు చేశారు. అంతేకాదు.. రియల్ ఎస్టేట్ లో నిందితులు పెట్టుబడులు పెట్టారు. డబ్బును జమ చేసేందుకు పల్ షల్ కంపెనీలు ఏర్పాటు చేసారు. ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ షాపులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది. దేవిక రాణితో పాటు ఏడుగురు ఉద్యోగుల పాత్రపై ఈడీ ప్రస్తావించింది.