ఎన్నికలకు ముందు జగన్ కీలక నిర్ణయం.. అన్ని జిల్లాలకు నూతన అధ్యక్షులు..!

-

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నూతన కార్యవర్గాన్ని నియమించింది వైసీపీ అదిష్టానం. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో జిల్లాల్లో నూతన నియామకాలను చేపట్టినట్లు వైసీపీ ప్రకటించింది. అన్ని జిల్లాలకు నూతన అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ సహా మొత్తం కార్యవర్గాన్ని వైసిపి కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఆయా జిల్లాలకు చెందిన కార్యవర్గంలో చోటుదక్కిన నాయకుల పేర్లను ప్రకటించింది  వైసీపీ. 

అల్లూరి సీతారామరాజు జిల్లా : కొత్తగుల్లి భాగ్యలక్ష్మి (ఎమ్మెల్యే) 

అనకాపల్లి జిల్లా : బొడ్డేట ప్రసాద్

అనంతపురం : పైల నరసింహయ్య 

అన్నమయ్య జిల్లా : గడికోట శ్రీకాంత్ రెడ్డి (ఎమ్మెల్యే)

 బాపట్ల  : మోపిదేవి వెంకటరమణ (ఎంపీ)

చిత్తూరు : కె ఆర్ జె భరత్ (ఎమ్మెల్సీ)

కోనసీమ : పొన్నాడ వెంకట సతీష్ కుమార్ (ఎమ్మెల్యే)

ఈస్ట్ గోదావరి : జక్కంపూడి రాజా (ఎమ్మెల్యే)

ఏలూరు  : ఆళ్ల నాని (ఎమ్మెల్యే)

గుంటూరు : డొక్కా మాణిక్య వరప్రసాద్

కాకినాడ : కురసాల కన్నబాబు (ఎమ్మెల్యే)

కృష్ణా :  పేర్ని నాని (ఎమ్మెల్యే)

కర్నూలు  : వై బాలనాగిరెడ్డి (ఎమ్మెల్యే) 

నంద్యాల : కాటసాని రామ్ భూపాల్ రెడ్డి (ఎమ్మెల్యే)

ఎన్టీఆర్ జిల్లా  :వెల్లంపల్లి శ్రీనివాస్ (ఎమ్మెల్యే)

పల్నాడు జిల్లా : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఎమ్మెల్యే)

పార్వతీపురం మన్యం : శత్రుచర్ల పరీక్షిత్ రాజు  

ప్రకాశం : జంకె వెంకటరెడ్డి

నెల్లూరు : వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (ఎంపీ) 

సత్యసాయి జిల్లా : ఎం. శంకరనారాయణ (ఎమ్మెల్యే)

శ్రీకాకుళం :ధర్మాన కృష్ణదాస్ (ఎమ్మెల్యే)

తిరుపతి జిల్లా : నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

విజయనగరం : మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జడ్పీ చైర్మన్

వెస్ట్ గోదావరి :  చెరుకువాడ శ్రీరంగనాథరాజు (ఎమ్మెల్యే)

వైఎస్ఆర్ జిల్లా : కే.సురేష్ బాబు (మేయర్)

Read more RELATED
Recommended to you

Latest news