తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో తిరుమల ఆలయం రద్దీగా మారింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 30గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలన్ని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో భక్తులు ఉన్నారు.
అంతలా తిరుమలలో రష్ ఉంది. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 82, 886మంది భక్తులు దర్శించుకున్నారు. 44, 234 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.09 కోట్లు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
- తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తారు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 30 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82886 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 44234 మంది భక్తులు
- హుండి ఆదాయం 4.09 కోట్లు