ఏక్‌నాథ్‌ షిండేకు షాక్‌.. ప్రవీణ్‌ షిండే సహా పలువురు గులాబీ గూటికి

-

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే బీఆర్‌ఎస్‌ భారీ షాక్‌ ఇచ్చింది. మహారాష్ట్రలోని సౌత్‌ నాగ్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కీలక నేత ప్రవీణ్‌ షిండే సహా ఇతర నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ పరంగా శివసేన (షిండే గ్రూప్‌) అయినా ఆ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తాజాగా ప్రవీణ్‌ షిండే బీఆర్‌ఎస్‌లో చేరటంతో ఒకవైపు శివసేనకు, మరోవైపు బీజేపీకి భారీ షాక్‌ తగిలినట్టు అయిందనే చర్చ మహారాష్ట్రలో జోరుగా సాగుతోంది.  ఆయనతోపాటు బీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు మహారాష్ట్ర నేతలకు గులాబీ కండువా కప్పి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన వారిలో ధవలయన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు విక్రమ్‌పిసే, పద్మశాలి యువసేన వ్యవస్థాపకుడు గౌతమ్‌సంగ, వ్యాపారవేత్త రఘురాములు కందికట్ల, సామ్రాట్‌ మౌర్యసేన అధ్యక్షుడు మహారాష్ట్ర అర్జున్‌ సల్గర్‌, బీజేపీ ఓబీసీ సెల్‌ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైభవ్‌షెట్‌, మనీష్‌ గావండే తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news