నేడు తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ టైమ్ టేబుల్ ఖరారు

-

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి ఇవాళ కౌన్సెలింగ్‌ టైం టేబుల్‌ ఖరారు కానుంది. ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశం ఈరోజు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరగనుంది. ఛైర్మన్‌ లింబాద్రి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, ఇతర సభ్యులు కౌన్సెలింగ్‌ తేదీలను ఖరారు చేస్తారు.

డిగ్రీలో ప్రవేశాలకు ‘దోస్త్‌’ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం కాగా.. జూన్‌ 16వ తేదీన తొలి విడత సీట్లను కేటాయిస్తారు. మొత్తానికి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ జూన్‌ 3 లేదా 4వ వారంలో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూన్‌ 4వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ జరగనుంది. జూన్‌ 18న ఫలితాలు విడుదలవుతాయి. ఆ మరుసటి రోజు నుంచి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలతోపాటు ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాసంస్థల్లో ఉమ్మడి ప్రవేశానికి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది.  జులై 25వ తేదీ నాటికి చివరి విడత ముగుస్తుంది.

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు వచ్చినవారు వాటిల్లో చేరతారు. ఆ వెంటనే ఎంసెట్‌ చివరి విడత జరిపితే రాష్ట్ర కళాశాలల్లో ఖాళీ అయిన సీట్లను భర్తీ చేసుకోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news