ఏనుగు బీభత్సం చేస్తున్న తరుణంలో.. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు జిల్లా ఎస్పీ సురేష్ కుమార్. ఆసిఫాబాద్ జిల్లా లోని చింతల మానేపల్లిలోకి ప్రవేశించిన ఒక ఏనుగు ఇప్పటివరకు ఇద్దరి మృతి కి కారణమైనట్టుగా జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపిఎస్ గారు తెలియజేశారు.
కావున చింతలమానపల్లి, పెంచికాల్ పెట్, దహెగాం మరియు బెజ్జుర్ మండల చుట్టుపక్క గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఎవరు కూడా ఒంటరిగా చేను, పొలాల వైపు వెళ్లకూడదని తెలియజేశారు. ఒంటరిగా ఇండ్ల నుంచి ఎవరు బయటికి రాకూడదని తెలియజేశారు. భయాందోళనకు గురికావలసిన అవసరం లేదని తెలిపారు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక బృందాల ద్వారా ఏనుగు జాడ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలియజేశారు.