Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్ కెరీర్ ప్రమాదంలో పడింది. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ స్లో ఓవర్ రేటు మెయింటైన్ చేయడంతో బిసిసిఐ మరోసారి జరిమానా విధించింది. సీఎస్కే తో మ్యాచ్లోను ఢిల్లీ క్యాపిటల్స్ ఇదే తప్పు చేసిన విషయం మనందరికీ తెలిసిందే.

అప్పుడు 12 లక్షలు ఫైన్ వేసిన బీసీసీఐ… రెండవ సారీ అదే తప్పు చేసినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్ కు 24 లక్షలు జరిమానా విధించింది. ఇంపాక్ట్ క్లియర్ సహా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ లందరికీ ఈ ఫైన్ పడింది. మరోసారి ఇదే జరిగితే పంత్ కు 30 లక్షల జరిమానాలతో పాటు ఒక మ్యాచ్ నిషేధిస్తారు.